షాద్‌నగర్‌లో విషాదం..నీటి సంపులో దూకిన తల్లి.. ముగ్గురు చిన్నారులు మృతి..ప్రాణాలతో బయటపడ్డ తల్లి

షాద్‌నగర్‌లో విషాదం..నీటి సంపులో దూకిన తల్లి.. ముగ్గురు చిన్నారులు మృతి..ప్రాణాలతో బయటపడ్డ తల్లి

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చెన్నయ్య భార్య తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఉన్న నీటి సంపులో దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడినట్లు ప్రాథమిక సమాచారం.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.